Posts

Showing posts from November, 2020

హత్యాచార చట్టం పై హత్య యత్నం ?

అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని మహాత్మాగాంధీ పలికిన మాటలను, దేశ భవిష్యత్తు, ప్రగతి, ఉన్నతి, దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితి మీదో లేదా రాజ్యాంగం మీదో ఆధారపడిలేదు. దేశ భవిష్యత్తు దేశ తల్లులపైన ఆధారపడి ఉంది అన్న స్వామి వివేకానంద ప్రవచనాలను ఒక్కసారి స్మరించుకుంటూ అటువంటి మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిని  కఠినంగా శిక్షంచడానికి  అటువంటి వాటిని నిరోధించి వారి భద్రతను, గౌరవాన్ని కాపాడటానికి ప్రస్తుతం ఉన్న చట్టాలను, మరి ముఖ్యంగా నిర్భయ సంఘటన తరువాత మరింత సమర్థవంతంగా, కఠినంగా రూపొందించాయి  మన  ప్రభుత్వాలు. అయితే ఈ చట్టాలు  అమాయక మహిళలకు, నిజమైన బాధితులకు ఎంతవరకు ఉపోయోగపడుతున్నాయనే దానికంటే ఎంతమంది ఆడవారు ఈ చట్టాలను తమ స్వార్ధ ప్రయోజనాలకు ఉపోయోగించుకుంటున్నారు అనే విషయాన్ని చర్చించవల్సినా అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉంది. ఇవన్నీ నాకెందుకు  లేనిపోని వివాదాలు అనుకునే నేటికాలపు ప్రతి పౌరుడు, మేధావి, సామజిక కార్యకర్తలు ఇటువంటి సంఘటనలు జరిగినపుడు కులం, మతం, వర్గం, అనే అంశాలు తెరపైకి తీసుకురాకుండా న్...

యువత ప్రేమ, పరువుహత్యలకు చిరునామానా....?

 ప్రపంచంలోనే అత్యధికసంఖ్యలో యువత ఉన్న దేశంగా భారతదేశానికి పేరుంది. దేశ జనాభాలో 54 శాతం మంది 25 సంవత్సరాలు లోపు వారే అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్న రెండో దేశం భారత్ (63 కోట్ల మంది).  అంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ మొదటిస్థానాన్ని పోటీ పడుతున్నాం. ఇవన్నీ నాణానికి ఒక వైపే  రెండు వైపు  ఏముందో ఒకసారి తిప్పి చూస్తే  ఒళ్ళు గగుర్పొడిచే  దృశ్యాలు , రక్తపు మరకలు , మాంసపు ముద్దలు, మాడిమసైపోయినా దేహాలు ఎవరివి అనుకుంటున్నారా , రాజకీయనాయకులు ఎన్నికలప్పుడు  ఓట్లకోసం, గెలిచాక వచ్చిన నిధులను మింగేయగా చేయడానికి ఏమిలేనపుడు స్వచ్చందంగా ముందుకు  రావాలి అని పిలుపునిస్తే  వెనకా ముందు ఆలోచించకుండా వచ్చేస్తామే మేమేనండి యువత, బూడిద పాలౌతున్న మా జీవితాలే గురించే ఈ చర్చంతా.  యువత మీద   మన దేశంలో రోజు రోజుకూ కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగిన ఈ హత్యలు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. మా రోజుల్లో ...

న్యాయమూర్తుల నియామకం తొలగింపు పై సమగ్ర విశ్లేషణ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్‌గా వున్న జస్టిస్‌ ఎన్‌వి రమణ పైన, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరితో సహా మరికొందరిపైన ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగ ఆరోపణలు   చేయడం దానిపై వివిధ  ప్రసార మాధ్యమాల్లో  ఎంతో  మంది మేధావులు తమ విశ్లేషణలు తెలియాచేయడం గత కొన్నిరోజులుగా ప్రజలందరూ గమనిస్తున్నారు . అయితే ఒకోకరు ఒకొక అభిప్రాయాన్ని వెలువరించడం వలన అసలు న్యాయమూర్తుల నియామకం ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా వారిమీద ఆరోపణలు వచ్చినప్పుడు వారిని ఏ విధంగా పదవినుండి తొలగించాలి అనే విషయాలను కూలంకషంగా తెలుసుకుందాం. ఒక దేశ ఔన్నత్యాన్ని, నాగరికతను ఆదేశ న్యాయవ్యవస్థ పనితీరులో చూడవచ్చని' లార్డ్బ్రైస్ పేర్కొన్నారు. మనదేశం ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థను అనుసరిస్తుంది. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, దాని కింద రాష్ట్రస్థాయిలో హైకోర్టులు, వాటి కింద స్థానిక స్థాయిలో సబార్డినేట్ కోర్టులు ఉన్నాయి. దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి. భారత రాజ్యాంగ  నిర్మాతలు బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏకీకృత, సమన్యాయ పాలనను; అమెరికా రాజ్యాంగం నుంచి న్యాయసమీక్ష,...