హత్యాచార చట్టం పై హత్య యత్నం ?
అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని మహాత్మాగాంధీ పలికిన మాటలను, దేశ భవిష్యత్తు, ప్రగతి, ఉన్నతి, దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితి మీదో లేదా రాజ్యాంగం మీదో ఆధారపడిలేదు. దేశ భవిష్యత్తు దేశ తల్లులపైన ఆధారపడి ఉంది అన్న స్వామి వివేకానంద ప్రవచనాలను ఒక్కసారి స్మరించుకుంటూ అటువంటి మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షంచడానికి అటువంటి వాటిని నిరోధించి వారి భద్రతను, గౌరవాన్ని కాపాడటానికి ప్రస్తుతం ఉన్న చట్టాలను, మరి ముఖ్యంగా నిర్భయ సంఘటన తరువాత మరింత సమర్థవంతంగా, కఠినంగా రూపొందించాయి మన ప్రభుత్వాలు. అయితే ఈ చట్టాలు అమాయక మహిళలకు, నిజమైన బాధితులకు ఎంతవరకు ఉపోయోగపడుతున్నాయనే దానికంటే ఎంతమంది ఆడవారు ఈ చట్టాలను తమ స్వార్ధ ప్రయోజనాలకు ఉపోయోగించుకుంటున్నారు అనే విషయాన్ని చర్చించవల్సినా అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉంది. ఇవన్నీ నాకెందుకు లేనిపోని వివాదాలు అనుకునే నేటికాలపు ప్రతి పౌరుడు, మేధావి, సామజిక కార్యకర్తలు ఇటువంటి సంఘటనలు జరిగినపుడు కులం, మతం, వర్గం, అనే అంశాలు తెరపైకి తీసుకురాకుండా న్యాయం వైపు నిలబడాలి. చట్టం లో ఉన్న అనుకూలతను తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటూ తద్వారా ఎన్నో కుటుంబాలను వ్యక్తులను వీధిపాలు చేస్తున్నా ప్రతి వ్యక్తిని ఉద్దేశించి రాస్త్తున్న వ్యాసం ఇది.
ఎందుకంటే భారత రాజ్యాంగ ప్రకరణ 21 ప్రకారం ప్రజలందరికి ఆత్మగౌరవంతో జీవించే హక్కు ఉంది. ఇందులో ఆడ, మగ తేడా లేదు అందరికి సమానత్వపు హక్కు ఉంది . కానీ ఈ మధ్య తప్పుడు అత్యాచార ఫిర్యాదులు సమాజాన్ని అతలాకుతలంచేస్తున్నాయి. నిజామా కాదా అనే నిర్దారింపు లేకుండా ప్రతిఒక్కరు బాధితురాలిగా పిలవబడే వ్యక్తి వైపు నిలబడతారు అనే నమ్మకం వల్ల అటువంటి దైర్యం వల్ల కొంత మంది స్వార్ధ పరులు వారి వారి వ్యవహారాలు చక్కపెట్టుకోవడం కోసం చేస్తున్నా చట్ట వ్యతిరేక, అనైతిక చర్యలివి, కానీ తరువాత అవి అబద్దం అని తెలిసాక నిలబడ్డ మన మెక్కడ దాన్ని ఊరుమొత్తం మోసిన మాధ్యమాలు ఎక్కడ. మచ్చుకు దేశం లో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే నేటి యువభారతం ఎటువైపు వెళ్తుందో అనే భయం మన అందరిలో కలగకమానదు. పోలీస్ స్టేషన్లోనే తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ కిందటి సంవత్సరం ఒక వివాహిత బంజారాహిల్స్ పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసినా విషయం మనం మర్చిపోయివుండొచ్చు. పోలీసులు తన భర్త కళ్లెదుటే అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆరోపించడం అప్పట్లో సంచలనం రేకిత్తించింది. ఆ విషయంపైనా యావత్తు రాష్ట్రము తమ మద్దతు వారికీ ప్రకటించే లోపే ఒక సివిల్ వివాదం నుండి తప్పించుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేసాం మమ్మల్ని క్షమించండి అంటూ ఆ దంపతులిద్దరూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో తలలు పట్టుకోవడం ప్రజల వంతు అయ్యింది. అదేవిధంగా మనదగ్గరే జరిగిన ప్రముఖుల పేర్లు బయటికి వచ్చినా కేసులో కొంతమంది పై తప్పుడు అత్యాచార ఫిర్యాదు చేసానని సాక్షాత్తు బాధితురాలే చెప్పినా ఆ లోపు ఆ కేసుతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల పేర్లు బయటకు రావడం ఈ లోపు వారు వారి కుటుంబ సభ్యులు అనుభవించాల్సినా మానసిక శిక్ష అనుభవించడం మనకు తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్లోని బరేలీ జిల్లాకు చెందిన ఓ 32 ఏళ్ల మహిళ కొందరి వద్ద 2.50 లక్షలు అప్పులు తీసుకున్నాక వాటిని తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో తనను అప్పు అడిగారని 39 మంది అత్యాచారం చేశారంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ, ఆమె భర్త తప్పుడు కేసులు పెట్టారని తెలిసాక పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళపై రివర్స్ కేసు పెట్టారు. కామాంధుల అకృత్యాలకు, ప్రేమోన్మాదుల ఘాతుకానికి, దళారుల మోసాలకు గురైన బాధితులకు ఆర్థిక సాయం అందించి అండగా నిలబడేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు బాధితులకు ఆర్థిక పరిహారం అందించడం జరుగుతుంది .ఈ పరిహారం పొందడానికి ఉత్తరప్రదేశ్ లోని మసూరి జిల్లాలో ఇద్దరు మహిళలు తమపై గ్యాంగ్ రేప్ జరిగిందని పిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా వారు ప్రభుత్వ పరిహారం పొందడానికి తప్పుడు కేసు పెట్టారని తెలిసి అటువంటి తప్పుడు రేప్ కేసు పెట్టినందుకు వారిమీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.
అదేవిధంగా ముంబై లో 2013 లో ప్రముఖ డి.ఐ.జి అయినటువంటి సునీల్ పరాస్కర్ (IPS) పై ఒక మోడల్ తప్పుడు రేప్ కేసు పెట్టడం జరిగింది. దాని పై శివసేన అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయం లో చాల ఘాటుగా ఆడవాళ్ళకి తప్పుడు రేప్ కేసు పెట్టడం తద్వారా సమాజం యొక్క చూపుని తమవైపు తిప్పుకోవడం అనేది నేటి కాలపు ధోరణి అని ప్రచురించడం అప్పట్లో పలు విమర్శలకు దారితీసింది. అయితే అవి విమర్శలు కాదు అక్షర సత్యాలని పోలీసులు ఆ కేసు లో దాఖలు చేసినా 724 పేజీల అభియోగపత్రం పత్రం మీద జరిగిన వాదోప వాదాల తరువాత కోర్ట్ సునీల్ పరాస్కర్ ను నిర్దోషిగా ప్రకటించడం కూడా యావత్తు సమాజాన్ని తప్పుడు అత్యాచార కేసులు గురించి చర్చించేలా చేసింది. బాలీవుడ్ నటుడు కరణ్ ఒబెరాయ్ మీద తప్పుడు రేప్ ఆరోపణలు చేసినందుకు ముంబై పోలీసులు ఒక మహిళా మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినా విషయం ఎంతమంది గుర్తుపెట్టుకొని ఉంటారు. 2014 ఢిల్లీ మహిళా కమిషన్ రిపోర్ట్ ప్రకారం 2012-13 లో నమోదైన రేప్ కేసుల్లో 53% తప్పుడు కేసులే అని నివేదిక ఇవ్వడం జరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స బ్యూరో నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద 2016 లో 38,947 రేప్ కేసులు నమోదు అవ్వగా అందులో 10, 068 కేసులు తన ప్రియుడు పెళ్లి చేసుకోను అని చెప్పడం వల్ల వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పెట్టిన తప్పుడు కేసులుగా నిర్దారించడం జరిగింది. 2015 లో ఒక జాతీయ స్థాయి పత్రిక జర్నలిస్ట్ చేసినా సర్వే ప్రకారం ఎక్కువ శాతం తప్పుడు రేప్ కేసులు పెళ్లి కాకుండా తమ కూతురు తన ప్రియుడి తో లైంగిక సంబంధం పెట్టుకుందని బయటప్రపంచానికి తెలియడం చేత ఆ విషయాన్నీ తొక్కిపెట్టడానికి బలవంతంగా వారి వారి కుమార్తెలతో ఇటువంటి కేసులు పెట్టిస్తున్నారని తెలిసింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే తల్లితండ్రులు కుమార్తె తన ప్రియుడి తో ఇష్టానుసారం లైంగిక సంబంధం పెట్టుకుందనే విషయం భరించటం కంటే ఆమె మీద ఆ వ్యక్తి ఆమె ఇష్టం లేకుండా రేప్ చేసాడు అనే విషయాన్ని భరించటానికి మానసికంగా అంగీకరించగలుగుతున్నారు. దీనికి ప్రధాన కారణం సమాజం నుండి వారికీ లభించే సానుభూతి, ఓదార్పు. అదేవిధంగా కొన్ని కేసుల్లో డబ్బులు కోసం, స్వార్ధపూరిత రాజకీయ ప్రయోజనలకోసం కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ కైలాష్ గంబీర్ ఆడవాళ్లు రేప్ చట్టాలని మగవారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయుధంలాగా వాడుతూ, తను ప్రేమించిన వ్యక్తికి లేదా శారీరకంగా దగ్గరైన వ్యక్తిని బలవంతంగా పెళ్లిచేసుకోవడం కోసం లేదా డబ్బుల కోసం వేధిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.
2019 లో ఢిల్లీ స్పెషల్ కోర్ట్ ఒక రేప్ కేసు కి సంబందించిన కేసు విచారణలో భాగంగా మహిళా తప్పుడు కేసు పెట్టిందని నిర్దారింఛి ఆమె పై భారతీయ శిక్షాస్పృతిలోని సెక్షన్ 182 ప్రకారం కేసు నమోదు చేయమని సంబంధిత పోలీసులుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత నెల ఆగష్టు లో బొంబాయి హైకోర్టు ఒక మహిళా తన ప్రియుడి పై తప్పుడు అత్యాచార కేసు పెట్టినందుకు 25,000 వేల రూపాయలు జరిమానా విధించి ఆ మొత్తం రాష్ట్ర పోలీస్ సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది. 2015 సంవత్సరం లో దేశంలో కొంత మంది మహిళలు రేప్ కేసుల విషయంలో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఇలా తప్పుడు కేసులు పెట్టిన వారిని తగిన విధంగా శిక్షించాలని ఢిల్లీ హై కోర్ట్ అభిప్రాయపడింది. మహిళలు తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించుకొని కొన్ని తప్పుడు కేసులు పెడుతున్నారని, దీని వలన నిందితుడు సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నారని ఇటువంటి కేసులో నిందితుడు తీవ్ర ఉద్వేగభరితమైన నిస్పృహ, వేదన కలుగుతాయని, కోర్ట్ పేర్కొన్నది. ఇక తప్పుడు కేసులలో బయటపడినప్పటికీ, సమాజంలో నిందితుడు అత్యాచారం చేసిన వ్యక్తిగానే గుర్తించబడుతున్నారని కోర్ట్ తెలియజేసింది. ఏ విధంగానైతే ఆడవారిపట్ల జరిగే లైంగిక దాడి విషయాల్లో బాధితురాలి పేరు బయటకి రాకుండా సెక్షన్ 228A ఉందొ అదే విధంగా శిక్ష ఖరారు అయ్యే వరకు కూడా నిందితుడుగా పిలవబడే వ్యక్తి పేరుకూడా బయటకి రాకుండా చూడాలనే డిమాండ్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ సంస్కృతి ఇక్కడే కాదు పరాయి దేశమైనా సైప్రస్ లో తనపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన ఒక బ్రిటిష్ టీనేజీ అమ్మాయిని తప్పుడు ఆరోపణలు చేశారంటూ తిరిగి ఆమె మీదే కేసు పెట్టి కోర్టు జైలు శిక్ష విధించింది. ఇన్ని జరుగుతున్నా అలాంటి పరిస్థితి ఇప్పటివరకు మనదేశం లో ఒక్కటి జరగలేదు. ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు అనే చెప్పే మనమే ఆస్తికత్వానికి , నాస్తికత్వానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాము ఎందుకంటే ఎవరి భావాలను వారు వ్యక్తపరుచుకోవచ్చు కాబట్టి. కానీ ఇటువంటి తప్పుడు ఫిర్యాదుల విషయంలో మాత్రం కులం, లింగ బేధం తీసుకువస్తాం. తద్వారా ఎవరు నోరు మెదపకుండా రాజ్యాంగం కల్పించినా ప్రకరణ 19 ఈ విషయం లో మాత్రం లేదనే విధంగా.
భారతీయ శిక్షాస్పృతిలోని సెక్షన్ 182, 211 ప్రకారం ఈ విధంగా ఎవరైతే తప్పుడు అత్యాచార కేసులు పెడతారో అటువంటి మహిళల మీద కూడా కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. అంతేకాకుండా నేరం రుజువైతే ఏడూ సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. కానీ ఎంత మందికి ఈ విషయం పైన అవగాహనా ఉంది, తెలిసి కూడా ఎంతమంది ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొన్నారు పైన చెప్పినా విషయాల్లో తప్ప. నేరస్తుల్ని శిక్షించడానికి భారత రాజ్యాగం లో కులం ,లింగం అనే బేధాలు లేవు ఎవరు తప్పు చేసినా శిక్ష ఒకేలా ఉంటుంది. అత్యాచారం జరిగిందంటూ తప్పుడు ఫిర్యాదులు చేస్తే మహిళకు శిక్ష విధించాల్సిన సమయం ఆసన్నమైందని ఢిల్లీ కోర్టు అభిప్రాయమే మనకు కనువిప్పు కావాలి. ఏదేమైనా ఇటువంటి తప్పుడు అత్యాచార కేసులు వల్ల నిజమైన బాధితులకు సరైనా న్యాయం సరైనా సమయంలో జరగడం లేదనేది మాత్రం వాస్తవం.సామాజిక దృక్పథంలో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విషయాలపై చర్చించి సమాజంలో మార్పు తీసుకువస్తే తప్ప మనం కోరుకునే సత్వర న్యాయం మనకు లభించదు.
ఇట్లు
మీ
ప్రజల మనిషి
సుంకర నరేష్
9206234234
చాలా క్లుప్తంగా వివరించారు. మంచి విశ్లేషణ ...
ReplyDeleteహృయపూర్వక నమసుమాంజలి🙏🙏🙏అన్నాగారు💐💐💐
ReplyDeleteమీరు వ్రాసే ప్రతి విషయం న్యాయవిద్యార్థిగా నా జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నా
మీరు వ్రాసేది, మాట్లాడే ప్రతి న్యాయపరమైన విషయాలను నా స్నేహితులతో పంచుకోవడం వలన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్న
క్లాస్ లో మేము కొంతవరకు నేర్చుకుంటే మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీ ద్వారా తెలుసుకుంటున్నాము
సమాజంలో జరుగుతున్న ప్రతి అవినీతి,అరాచకాలను ఒక బాధ్యతగల పౌరుడిగా,న్యాయవాదిగా ఎలా వాటిని రూపుమాపి ప్రజలకు మంచి జరిగేలా చెయ్యాలో మీ నుండి నేను నేర్చుకుంటున్న అన్న
మీ ద్వారా ప్రజలకు చట్టాలపై మంచి అవగాహన కూడా కలుగుతుంది అన్న
ధన్యవాదములు అన్నగారు💐💐💐💐💐